బీహార్‌లో బీజేపీ నేత కాల్చివేత
- పాట్నాలో ఇటీవల వ్యాపారి గోపాల్ ఖేమ్కా హత్య
- బైక్‌పై వచ్చి బీజేపీ నేత సురేంద్ర కేవత్‌ను కాల్చి చంపిన దుండగులు
- నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే గోపాల్ రవిదాస్, మాజీ మంత్రి శ్యామ్ రజక్ ఆసుపత్రికి చేరుకున్నారు. కేవత్ కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫోరెన్సిక్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ‘‘సురేంద్ర పొలాల్లో పని చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు. అతన్ని ఎయిమ్స్‌కు తరలించారు. కానీ చికిత్స పొందుతూ మరణించాడు. ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేశాం" అని పోలీసు అధికారి కన్హయ్య సింగ్ తెలిపారు.
సురేంద్ర కేవత్ గతంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడిగా పనిచేశారు. ఈ హత్య ఆ ప్రాంతంలో భయాందోళనలను రేకెత్తించింది. ముఖ్యంగా వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యకు గురైన కొన్ని రోజుల తర్వాత ఈ దారుణ హత్య జరగడం గమనార్హం. రాష్ట్రంలో వరుస హత్యలపై నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి.