ఓటీటీలో తమిళ హారర్ థ్రిల్లర్ .. ఆత్మలు చేసే హత్యలు!
- తమిళంలో రూపొందిన హారర్ థ్రిల్లర్
- ప్రధానమైన పాత్రల్లో విమల్ - ఛాయాదేవి
- రెండు గ్రామాల చుట్టూ తిరిగే కథ
- ఈ నెల 4 నుంచి ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్
తమిళంలో రూపొందిన ఈ సినిమాలో విమల్ - ఛాయాదేవి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇసక్కి కర్వన్నన్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, జూన్ 6వ తేదీన అక్కడి థియేటర్లలో విడుదలైంది. ఈ నెల 4వ తేదీ నుంచి 'ఆహా తమిళ్' లో స్ట్రీమింగ్ కానుంది. మనోజ్ కుమార్ .. శ్రీరంజని .. అరుళ్ దాస్ .. కూల్ సురేశ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించే అవకాశం ఉంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే, పక్క పక్కనే ఉన్న రెండు గ్రామాలలో మతపరమైన గొడవలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు మతాల వారికి సంబంధించిన హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆత్మలు చేస్తున్న హత్యలుగా భావిస్తూ అంతా భయపడుతూ ఉంటారు. అసలు కారణం అదేనా? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ కథ ముందుకు వెళుతుంది. ఓటీటీ వైవు నుంచి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి మరి.