'కన్నప్ప' సినిమాను చూసిన రజనీకాంత్.. మంచు విష్ణు భావోద్వేగ పోస్టు
- 'కన్నప్ప' అద్భుతంగా ఉందని రజినీకాంత్ ప్రశంసించారన్న మంచు విష్ణు
- ఈ క్షణం కోసం 22 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానంటూ విష్ణు భావోద్వేగం
- జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా 'కన్నప్ప' విడుదల
"రజనీకాంత్ అంకుల్ నిన్న రాత్రి ‘కన్నప్ప’ సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత ఆయన నన్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ‘కన్నప్ప’ చిత్రం తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. ఒక నటుడిగా ఈ క్షణం కోసం నేను 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ నెల 27న మా సినిమా విడుదల కానుంది. ఆ పరమశివుడి లీలను మీ అందరికీ చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని మంచు విష్ణు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ బాబు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, నటి కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.