కప్పు కొట్టిన ఆర్సీబీ.. బన్నీ తనయుడి భావోద్వేగం.. ఇదిగో వీడియో!
ఇదిలాఉంటే... 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ ఆర్సీబీ ఐపీఎల్ తొలి టైటిల్ను సొంతం చేసుకోవడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. దేశవ్యాప్తంగా రాయల్ ఛాలెంజర్స్ అభిమానులు, కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా జట్టుకు విషెస్ తెలియజేస్తూ తమ భావోద్వేగాలను పంచుకుంటున్నారు.
ఇక, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్... విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఆర్సీబీ విజయం సాధించడంతో బన్నీ తనయుడు ఎమోషనల్ అయ్యాడు. తలపై బాటిల్ నీళ్లు కుమ్మరించుకుని భిన్నంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆ వీడియోను అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం అయాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.