ఏపీ జవాన్ వీర మరణంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
- జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో ఏపీకి చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం
- దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు మురళీ నాయక్‌కు నివాళులర్పిస్తూ చంద్రబాబు పోస్ట్
- వీర జవాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ముఖ్యమంత్రి
"దేశ రక్షణలో శ్రీసత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు మురళీ నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.