పాక్ ఉగ్రవాదానికి ఆధారాలివిగో.. భారత హైకమిషనర్ దొరైస్వామి
- కీలక ఆధారాలు బయటపెట్టిన భారత్
- ఉగ్రవాదులకు పాక్ సైన్యం అంత్యక్రియలు.. శవపేటికలపై పాక్ పతాకం
- అమెరికా నిషేధిత ఉగ్రవాది హఫీజ్ అబ్దుర్ రవూఫ్తో పాక్ సైనికాధికారులు ఉన్న ఫోటో విడుదల
మీడియా సంస్థతో దొరైస్వామి మాట్లాడుతూ.. "ఈ ఫోటో చూడండి. ఇతను హఫీజ్ అబ్దుర్ రవూఫ్, అమెరికా నిషేధిత ఉగ్రవాది. అతని వెనుక ఉన్నది పాకిస్థాన్ సైన్యం. శవపేటికలపై పాకిస్థాన్ జాతీయ జెండాలున్నాయి. ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుంటే, మీ వ్యవస్థ గురించి ఏమనుకోవాలి?" అని దొరైస్వామి ప్రశ్నించారు. పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా అధికారికంగా మద్దతు ఇస్తోందని భారత్ దశాబ్దాలుగా చేస్తున్న ఆరోపణలకు ఈ ఫోటో ప్రత్యక్ష నిదర్శనమని దొరైస్వామి తెలిపారు.