వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి ఊరట
- లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిపై ఆరోపణలు
- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మిథున్ రెడ్డి
- ఈరోజు కౌంటర్ దాఖలు చేసిన ఏపీ సీఐడీ
సుప్రీంకోర్టులో ఈరోజు ఏపీ సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో ఆ కౌంటర్ ను పరిశీలించి రీజైండర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని మిథున్ రెడ్డి తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.