చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాపై కీలక అప్టేడ్
- ఉగాది రోజున చిరు, అనిల్ రావిపూడి సినిమాకు పూజా కార్యక్రమం
- జూన్ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం
- 2026 సంక్రాంతికి సినిమా విడుదలయ్యే అవకాశం
చిరు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం కామెడీ ఓరియెంటెడ్ గా ఉంటుందని... ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభంకానుందని, 2026 సంక్రాంతికి సినిమా విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తుండగా... భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.