రుషికొండకు బ్లూ ఫ్లాగ్ హోదా పునరుద్ధరణ... మంత్రి కందుల దుర్గేశ్ స్పందన
- కొన్ని రోజుల కిందట విశాఖ రుషికొండ బీచ్ ను పరిశీలించిన బ్లూ ఫ్లాగ్ జ్యూరీ
- బ్లూ ఫ్లాగ్ ను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటన
- సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ లకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి దుర్గేశ్
రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ కోసం కృషి చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ కోసం కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు.
ముఖ్యంగా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వివరించారు. మరి కొన్ని బీచ్ లకు కూడా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపామని మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు.