హార్ట్ ఎటాక్ రాకుండా టీకా.. చైనా శాస్త్రవేత్తల ఘనత!
- గుండెపోటు రాకుండా అడ్డుకునే టీకాను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
- ఎలుకల్లో చేసిన ప్రయోగం విజయవంతం
- గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలను క్లియర్ చేసే వ్యాక్సిన్
రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నే అథెరోస్ల్కెరోసిస్ అంటారు. దీనివల్ల గుండెకు రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా స్ట్రోక్, గుండెపోటు వస్తాయి. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అథెరోస్ల్కెరోసిస్కు అడ్డుకట్ట వేసేందుకు చైనా శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయోగంలో మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఈ వ్యాక్సిన్ ఇచ్చాక తెల్ల రక్త కణాలు క్రియాశీలమై యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా రోగ నిరోధకశక్తి మెరుగుపడి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. కాగా, మన దేశంలో 40-69 వయసు వారిలో మరణాలకు 45 శాతం హార్ట్ ఎటాకే కారణమని తేలింది.