నిర్మాతల కష్టాన్ని హీరోలు పట్టించుకోవట్లేదంటూ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- పైరసీ వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని వెల్లడి
- ప్రొడ్యూసర్ నష్టపోతే మాకేంటనే ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆరోపణ
- హీరోలు, ఆర్టిస్టులు మరో ప్రాజెక్టులో బిజీగా ఉంటున్నారని వివరణ
నిర్మాత కష్టాన్ని పట్టించుకోకుండా తదుపరి ప్రాజెక్టులో బిజీగా మారిపోతున్నారని అన్నారు. నిర్మాత నష్టపోతే మాకేంటనే ధోరణి సరికాదని, తమ వరకు వస్తే కానీ నొప్పి తెలియదని అన్నారు. త్వరలోనే ఈ విషయంపైనా మీటింగ్ పెట్టుకుంటామని నిర్మాత దిల్ రాజు చెప్పారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గానే కాకుండా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎఫ్డీసీ) చైర్మన్గా పైరసీపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంపై దృష్టిసారించినట్లు దిల్ రాజు వెల్లడించారు. ఈ విషయంపై ప్రభుత్వానికి త్వరలో లేఖ రాయనున్నట్లు దిల్ రాజు వివరించారు.