హీరోయిన్ కు వయసు అయిపోతే ఒప్పుకోరు: జ్యోతిక
- సౌత్ లో చాలా మంది డైరెక్టర్లు హీరోల కోసమే కథలు రాసుకుంటారన్న జ్యోతిక
- హీరోలకు వయసు అయిపోయినా జనాలు ఒప్పుకుంటారని వ్యాఖ్య
- తనకు 28 ఏళ్ల వయసులోనే పిల్లలు పుట్టారన్న జ్యోతిక
తనకు 28 ఏళ్ల వయసులో పిల్లలు పుట్టారని... ఆ తర్వాత విభిన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్నానని జ్యోతిక తెలిపారు. అప్పటి నుంచి స్టార్ హీరోలతో కలిసి నటించలేదని చెప్పారు. సౌత్ లోని ఇతర ఇండస్ట్రీల గురించి తాను చెప్పలేను కానీ... తమిళ్ ఇండస్ట్రీలో మాత్రం హీరోయిన్ కు వయసును అడ్డుగా చూస్తారని అన్నారు. అలాంటప్పుడు మనమే కొత్త డైరెక్టర్లతో పని చేస్తూ కెరీర్ ను నిర్మించుకోవాలని చెప్పారు.