ఏపీలో ఇక అధికారికంగా వాసవి అమ్మవారి ఆత్మార్పణదినం
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
- సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆర్యవైశ్య సంఘాల నేతలు
ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో సచివాలయంలో సీఎంను కలిసిన ఆర్య వైశ్య సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ నిర్ణయం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహించాలని నాడు ఆర్య వైశ్య సంఘాలు కోరగా మేనిఫెస్టోలో ఈ మేరకు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుతూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు ఇరుకుల రామకృష్ణ, ఆరవీటి నిర్మల, సేగు షణ్ముగం, ఎంవీబీ, గురు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.