'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్' సినిమాల అదనపు షోలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల షోలకు అనుమతి నిరాకరించిన ఏపీ ప్రభుత్వం
- 10 రోజుల పాటు ఐదు షోలకు మించకుండా ప్రదర్శించుకోవచ్చన్న హైకోర్టు
- హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్వులను సవరించిన ప్రభుత్వం
అయితే, సరైన భద్రత లేని థియేటర్లకు వచ్చే జనాలను నియంత్రించడం కష్టమని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటలకు అదనపు షోలకు అనుమతి నిరాకరించింది. 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు మించకుండా ప్రదర్శించుకోవచ్చని... ఐదు షోలలో ఒకటి బెనిఫిట్ షోగా నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.