బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న పుష్ప-2 హవా.. మరింత పెరిగిన కలెక్షన్లు
- శుక్రవారం నాడు రూ.13.75 కోట్ల వసూళ్లు
- అత్యధికంగా హిందీలో రూ.11 కోట్లు
- వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో మరింత పెరిగే అవకాశం
కాగా, పుష్ప-2 మూవీ తెలుగు వెర్షన్ కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు రాబడుతోంది. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో వసూళ్లు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కాగా, విడుదలైన అతి తక్కువ రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప-2 రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లకు పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే.
పుష్ప-2లో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించగా... సుకుమార్ దర్శకత్వం వహించారు. సునీల్, అనసూయతో పాటు పలువురు నటులు కీలక పాత్రల్లో నటించారు.