ఓటీటీలో పుష్ప-2 అంటూ వార్తలు... క్లారిటీ ఇచ్చిన చిత్రబృందం
- సోషల్ మీడియా వార్తలపై స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్
- పుష్ప- 2 విడుదలైన 56 రోజుల వరకూ ఓటీటీలో స్ట్రీమింగ్ కాదని స్పష్టం చేసిన చిత్ర బృందం
- వెండితెరపైనే పుష్ప-2ను చూసి హాలిడే సీజన్‌ను ఎంజాయ్ చేయమన్న చిత్ర బృందం
జనవరి రెండో వారం నుంచి పుష్ప- 2 స్ట్రీమింగ్ కానుందంటూ సోషల్ మీడియాలో పుకారు షికారు చేస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం (మైత్రీ మూవీ మేకర్స్) ఎక్స్ వేదికగా స్పందించింది. 56 రోజుల (థియేటర్లలో విడుదలైన నాటి నుంచి) కంటే ముందు ఏ ఓటీటీలో కూడా ఈ మూవీ విడుదల కాదని చిత్ర బృందం స్పష్టం చేసింది. వెండితెరపైనే పుష్ప- 2ను చూసి హాలిడే సీజన్‌ను ఎంజాయ్ చేయమని వెల్లడించింది.
'పుష్ప- 2: ది రూల్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై అనేక వార్తలు వస్తున్నాయి. రాబోయే అతి పెద్ద హాలీడే సీజన్‌లో ఈ మూవీని వెండితెరపై చూసి ఆస్వాదించండి. విడుదలైన నాటి నుంచి 56 రోజుల కన్నా ముందు ఏ ఓటీటీలోనూ పుష్ప- 2 స్ట్రీమింగ్ కాదు. ఇది వైల్డ్ ఫైర్ పుష్ప. వరల్డ్ వైడ్‌గా థియేటర్‌లోనే' అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చింది.