హిందీలో పుష్ప-2 అస్సలు తగ్గట్లేదు.. శనివారం రికార్డు స్థాయి కలెక్షన్లు
- హిందీ వెర్షన్లో శనివారం ఒక్క రోజే రూ.46.50 కోట్లు వసూళ్లు
- అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన పుష్ప-2
- కేవలం 10 రోజుల్లోనే రూ.507.50 కోట్ల కలెక్షన్లు
శుక్రవారం రూ.27.50 కోట్లు, శనివారం ఏకంగా రూ.46.50 కోట్లతో కలుపుకొని మొత్తం రూ.507.50 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని బాలీవుడ్ సినీ విశ్లేషకుడు, విమర్శకుడు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
బాలీవుడ్లో రెండవ శనివారం అత్యధిక వసూళ్లు (రూ.46.50 కోట్లు) రాబట్టిన చిత్రంగా కూడా పుష్ప-2 నిలిచింది. అంతకుముందు స్త్రీ2 మూవీ రూ. 33.80 కోట్లు, గదర్2 రూ. 31.07 కోట్లు, జవాన్ రూ. 31.07 కోట్లు, జవాన్ 30.10 కోట్లు, బాహుబలి-2 రూ.26.50 కోట్లు, ది కశ్మీర్ ఫైల్స్ రూ.24.80 కోట్లు, దంగల్ రూ.23.07 కోట్లు, పఠాన్ రూ.22.50 కోట్లు వసూలు చేయగా.. వాటన్నింటినీ పుష్ప-2 దాటేసింది.