నమ్మలేకపోతున్నా: అల్లు అర్జున్ అరెస్ట్ పై రష్మిక పోస్ట్
- ఈ ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు
- అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు
- 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
- మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు
- ఈ ఘటనకు ఒక్కరినే బాధ్యుల్ని చేయడం బాధాకరమన్న రష్మిక
కాగా, అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై పుష్ప-2 హీరోయిన్ రష్మిక మందన్న స్పందించారు. ఇప్పుడు నేను చూస్తున్నది నిజమేనా... నమ్మలేకపోతున్నా అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన సంఘటన దురదృష్టకరమైనదని, అత్యంత విషాదభరితమైనదని పేర్కొన్నారు. కానీ దీనంతటికీ ఒక్కరినే దీనికి బాధ్యులుగా చేయడం కలచివేస్తోందని రష్మిక ట్వీట్ చేశారు.