షారుఖ్ ఖాన్ కలెక్షన్ల రికార్డులను తుడిచేసిన పుష్ప-2
- ‘జవాన్’ లైఫ్‌టైమ్ కలెక్షన్లు దాటేసిన పుష్ప-2
- కేవలం 5 రోజుల్లోనే రూ.593 కోట్ల వసూలు
- హిందీలో వేగంగా రూ.300 కోట్లు సాధించిన చిత్రంగానూ రికార్డ్
హిందీ వెర్షన్లో అత్యంత వేగంగా రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా ‘పుష్ప-2’ నిలిచింది. కేవలం మొదటి 5 రోజుల్లోనే ఈ రికార్డు సాధించి ఆశ్చర్యపరిచింది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలు రూ.300 కోట్ల క్లబ్లో చేరడానికి 6 రోజులకు పైగా సమయం పట్టింది. కాగా సోమవారం ఈ సినిమా కలెక్షన్లు గణనీయంగా తగ్గాయని పేర్కొంది. కాగా 2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్‌గా ‘పుష్ప -2’ విడుదలైంది. ప్రధాన తారాగణంతో పాటు సునీల్, అనసూయ భరద్వాజ్, జగపతి బాబుతో పాటు పలువురు నటులు కీలక పాత్రలు పోషించారు.