అభిషేక్, ఐశ్వర్య విడిపోతున్నారనే ప్రచారంపై అమితాబ్ ఏమన్నారంటే..!
- రూమర్స్ ప్రచారం చేసేవాళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బిగ్ బీ
- ప్రపంచంలో మూర్ఖులకు కొదవలేదంటూ మండిపడ్డ వైనం
- తమ తప్పులను దాచి ఇతరుల లోపాలను వెతుకుతారంటూ ట్వీట్
మెదడులేని ఇలాంటి వ్యక్తుల రాతల వెనక వారి అజ్ఞానం, తెలివితక్కువతనం కనిపిస్తాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి వారి వ్యక్తిగత జీవితాల్లోని దురదృష్టాలను దాచి, ఇతరుల మాటల్లో ప్రతీ పదానికీ పెడార్థం తీస్తారంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు. ఇటీవల అభిషేక్ బచ్చన్ ఓ ట్వీట్ చేస్తూ సుదీర్ఘ కాలం దాంపత్య జీవనం గడిపిన వారు కూడా విడాకులు తీసుకుంటున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయని పేర్కొన్నారు. ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నిస్తూ ఓ సామాజిక సమస్యపై చర్చ కోసం చేసిన ఈ ట్వీట్ ను ఆయన సొంత జీవితానికి ఆపాదించి అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రచారం చేస్తున్నారని అమితాబ్ పరోక్షంగా చెప్పారు.