హీరోయిన్లను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
- తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్‌ను అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
- వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలను పెట్టుబడుల పేరుతో మోసం చేశారన్న అభియోగాలు
- బాధితుల్లో సినీ, వ్యాపార ప్రముఖులు
నటుడు సామ్రాట్ రెడ్డి సోదరి సమంత సన్నిహితురాలైన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి తాను మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుండి కాంతి దత్ కోసం గాలిస్తున్నారు. కాంతి దత్ బాధితుల్లో హీరోయిన్ సమంత, కీర్తి సురేశ్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి, పరిణితి చోప్రా వంటి వాళ్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంతి దత్ దాదాపు వంద కోట్లకుపైగా మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది.