పుష్ప-2 నుంచి 'పీలింగ్స్' సాంగ్ రిలీజ్.. కాసేపట్లోనే వ్యూస్ వెల్లువ
- డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు పుష్ప-2
- అభిమానులకు ముందస్తు ట్రీట్ గా పీలింగ్స్ సాంగ్
- గంటలోనే రెండు మిలియన్ల వ్యూస్
'పీలింగ్స్' అంటూ సాగే ఈ గీతానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించారు. చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. ఈ పాట ఆరంభంలో వచ్చే మలయాళ లిరిక్స్ ను సిజు తురావూర్ రచించారు. ఈ పాటలో బన్నీ మార్కు ఫుల్ ఎనర్జటిక్ స్టెప్పులను చూడొచ్చు. 'పీలింగ్స్' సాంగ్ యూట్యూబ్ లో విడుదలైన గంటలోనే 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.