ఏఎన్నార్ బయోపిక్ పై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు!
- ఏఎన్నార్ బయోపిక్ ను సినిమాగా తీయడం కష్టమన్న నాగార్జున
- డాక్యుమెంటరీగా తీస్తే బాగుంటుందని వ్యాఖ్య
- కొన్ని కల్పితాలను జోడించి డాక్యుమెంటరీ రూపొందించాలన్న నాగార్జున
ఏఎన్నార్ బయోపిక్ పై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుందని నాగార్జున అన్నారు. అయితే దాన్ని సినిమాగా కంటే డాక్యుమెంటరీగా తీస్తే బాగుంటుందనేది తన అభిప్రాయమని చెప్పారు. ఎందుకంటే ఆయన జీవితాన్ని సినిమాగా తీయాలంటే చాలా కష్టమని తెలిపారు.
తన జీవితంలో ఏఎన్నార్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదని నాగార్జున అన్నారు. ఆయన ఎదుగుదల అలా కొనసాగుతూనే పోయిందని చెప్పారు. ఆయన ఎదుగుదలను తెరపై చూపిస్తే బోర్ కొడుతుందేమోనని అన్నారు. ఒడిదుడుకులను చూపిస్తేనే సినిమా బాగుంటుందని చెప్పారు. అందుకే ఆయన జీవితంలో కొన్ని కల్పితాలను జోడించి డాక్యుమెంటరీ రూపొందించాలని అన్నారు.