'కుబేర' ఫస్ట్ గ్లింప్స్ షేర్ చేసిన మహేశ్ బాబు
- నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో కుబేర
- శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చిత్రం
- నేడు గ్లింప్స్ విడుదల చేసిన చిత్రబృందం
- ఆల్ ది బెస్ట్ చెప్పిన మహేశ్ బాబు
యాక్షన్, డ్రామా, సినిమాటోగ్రఫీల మేళవింపే ఈ కుబేర సినిమా అని మహేశ్ బాబు అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రానున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కూడా నటిస్తోంది. జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.