ఆలోచింపజేస్తున్న శేఖర్ కమ్ముల 'కుబేర' గ్లింప్స్
- 'కుబేర 'గ్లింప్స్ విడుదల
- డైలాగ్స్ లేకుండా గ్లింప్స్‌ను వదిలిన దర్శకుడు
- అందరినీ అలరిస్తూ, ఆలోచింపజేస్తున్న గ్లింప్స్
అమిగోస్ క్రియేషన్స్, ఎస్వీసీ ఎల్ఎల్పీ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న 'కుబేర' చిత్రం నుంచి నేడు గ్లింప్స్‌ను విడుదల చేశారు. గ్లింప్స్‌లో ఒక్క సంభాషణ కూడా లేకపోయినా.. ఆ విజువల్స్ చూస్తుంటే ఆ విజువల్స్ మనతో మాట్లాడినట్లుగా, ఎంతో డెప్త్‌గా అనిపిస్తుంది.
డబ్బుకు మానవ సంబంధాలకు ఉన్న సంబంధాన్ని, కుటుంబ భావొద్వేగాలను ప్రతి మనసును తాకే విధంగా చాలా లోతుగా శేఖర్ కమ్ముల ఈ చిత్రంలో డిస్కస్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.