‘దిల్ రాజు డ్రీమ్స్’ నెరవేరుతాయా?
- మరో కొత్త బ్యానర్‌కు 'దిల్' రాజు శ్రీకారం
- కొత్త వారికి అవకాశాలు ఇస్తానంటున్న దిల్ రాజు
- త్వరలోనే వెబ్సైట్ కూడా ప్రారంభం
సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ విశేషాలను తెలియజేశారు. 'దిల్' రాజు మాట్లాడుతూ ''నూతన ప్రతిభను గుర్తించి ఎంకరేజ్ చేయడానికి 'దిల్ రాజు డ్రీమ్' బ్యానర్‌ను స్థాపించాను. త్వరలోనే దీనికి సంబంధించిన వెబ్సైట్లో అన్ని విషయాను పొందుపరుస్తాం. ఈ వెబ్సైట్ ద్వారా మీ కంటెంట్ మా సంస్థ టీమ్‌కు చేరుతుంది. ఇందుకోసం వారంలో ఒకరోజు కేటాయించి ఈ కథలు నేను కూడా వింటాను. ఏడాదికి నాలుగైదు సినిమాలు మాత్రమే ఇందులో చేయాలని నిర్ణయించుకున్నాం.
ఈ క్రమంలో ఎలాంటి రికమండేషన్స్ పనిచేయవు. కేవలం టాలెంట్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం. ఎవరైనా సరే వెబ్సైట్ ద్వారానే మా టీమ్‌ను సంప్రదించాలి. ఇరవై నిమిషాల స్రిప్ట్‌ను అందులో పెట్టాలి. అందులో మా టీమ్‌కు నచ్చిన వాటిని మాత్రమే ఎంచుకుని వారంలో ఒకరోజు నేను వింటాను" అన్నారు.
న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించడంతో పాటు తన మనసుకు నచ్చిన క్యూట్ కథలను కూడా ఈ బ్యానర్లో తెరకెక్కించి దిల్ రాజు తన డ్రీమ్స్‌ను నెరవేర్చుకోవడంతో పాటు ఔత్సాహిక నటీనటులను, దర్శకులను సినీ పరిశ్రమకు పరిచయం చేయాలనే ఈ ఆలోచన అభినందనీయమే. సో.. దిల్ రాజు డ్రీమ్స్ నేరవేరాలని మనం కూడా కోరుకుందాం..!