నేను చేసిన ఆ తప్పుకి ఇప్పటికీ బాధపడుతుంటా: రాహుల్ సిప్లిగంజ్
- తాను రజనీకాంత్ కు వీరాభిమానినన్న రాహుల్
- మూవీ లుక్ లోనే రజనీ తనతో ఫొటో దిగారని వెల్లడి
- ఆ ఫొటోను షేర్ చేసి తప్పు చేశానని ఆవేదన
తాను రజనీకాంత్ కు వీరాభిమానినని రాహుల్ తెలిపారు. 'అన్నాత్తే' సినిమా షూటింగ్ సమయంలో ఆయనను కలిసే అవకాశం తనకు దక్కిందని... తన ఇష్టాన్ని గుర్తించి, ఆ మూవీ లుక్ లోనే ఆయన తనతో ఫొటో దిగారని చెప్పారు. ఈ సినిమాలో తన ఫస్ట్ లుక్ ను ఇంకా రిలీజ్ చేయలేదని, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఫొటోను షేర్ చేయవద్దని రజనీకాంత్ తనకు చెప్పారని తెలిపారు. అయితే, కొన్ని రోజుల తర్వాత తాను ఆ ఫొటోను షేర్ చేశానని... ఆ పిక్ వైరల్ అయిందని చెప్పారు. తన జీవితంలో తాను చేసిన తప్పు అదేనని... అలా చేసినందుకు తాను ఇప్పటికీ బాధ పడుతుంటానని తెలిపారు.