పుష్ప-2 ఫస్ట్‌హాఫ్ రిపోర్టు వచ్చేసింది..
- పుష్ప-2 ఫస్ట్‌హాఫ్ మైండ్ బ్లోయింగ్ అంటున్న దేవిశ్రీప్రసాద్
- కథ విన్నప్పుడే క్లాప్స్ కొట్టాను
- పుష్ప-2 నెక్ట్స్ లెవల్లో వుంటుంది
తాజాగా ఈ చిత్రం గురించి పుష్ప-2 సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సోమవారం హైదరాబాద్‌లో దేవిశ్రీప్రసాద్ లైవ్ కన్సర్ట్ గురించి ఏర్పాటు చేసిన ఓ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ''పుష్ప-2 ఇటీవల ఫస్ట్ హాఫ్ చూశాను. మైండ్ బ్లోయింగ్‌గా వుంది. పుష్ప కథను ఇప్పుడే కాదు స్క్రిప్ట్ విన్నప్పుడే నేను లిరిక్ రైటర్ చంద్రబోస్ మూడు సార్లు క్లాప్స్ కొట్టాం.. సుకుమార్ కథ చెబుతున్నప్పుడు ఇక్కడ ఇంటర్వెలా.. ఇక్కడ ఇంటర్వెలా అని మేము అంటున్నాం.. అంతలా మాకు ప్రతి సీన్ కిక్ ఇచ్చింది. ప్రతి సీన్లోనూ ఎంతో ఎనర్జీ వుంటుంది.
సినిమా చూసినప్పుడు సుకుమార్ కథను రాసిన విధానం సినిమాను తెరకెక్కించిన తీరు, అల్లు అర్జున్ నటించిన విధానం నెక్ట్స్ లెవల్లో వుంటుంది. సినిమా నెక్ట్స్ లెవల్ సినిమా అంతే.. ఇక ఫస్ట్ హాఫ్ అయితే సూపర్‌గా వుంది అంతే..అని అన్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మాటలు విన్న అల్లు అర్జున్ అభిమానులు సంతోషంలో వున్నారు. ఇటీవలే పుష్ప-2 మేకర్స్ ఫస్ట్‌హాఫ్‌ను లాక్ చేసినట్లుగా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
.