'దేవర' సినిమా చూస్తూ కుప్పకూలిన అభిమాని... మృతి
- కడప జిల్లాలో విషాదకర ఘటన
- ఈలలు, కేకలు వేస్తూ కుప్పకూలిన అభిమాని
- ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్టు వైద్యుల నిర్ధారణ
ఈ విషాదకర ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడిని మస్తాన్ వలిగా గుర్తించారు. ఆయనది సీకే దిన్నె మండలం జమాల్ పల్లి గ్రామం. ఒక అభిమాని అలా చనిపోవడం అక్కడున్న అందరినీ కలచివేసింది. మస్తాన్ వలి మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.