అమెరికాలో దుమ్మురేపుతున్న 'దేవర'
- ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'దేవర'
- విడుదలకు ముందే బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న తారక్ మూవీ
- హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ప్రీమియర్ షో టికెట్లు
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్... ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. 'దేవర 1' ఈ నెల 27న విడుదల అవుతోంది. మరోవైపు ఈ సినిమా విడుదల కాకముందే బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. అమెరికాలో 'దేవర' దుమ్మురేపుతోంది. ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పటికే 25 వేల టికెట్లు అమ్ముడుపోయి... 8 లక్షల డాలర్లను వసూలు చేశాయి.