రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్!
"ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఉండాల్సిన వ్యక్తి సచివాలయానికి వస్తే ఇలాగే ఉంటుందని తెలిపారు. ఆయన నోటి నుంచి వస్తున్న ఆణిముత్యాల లాంటి మాటలకు నవ్వుతున్న కాంగ్రెస్ నేతలను చూస్తే జాలేస్తుంది. ఆయన బూతు పురాణానికి అమాయకంగా చప్పట్లు కొడుతున్న చిన్నారుల భవిష్యత్తు పట్ల ఆందోళన కలుగుతోంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకుల కొమ్ముకాసిన నేటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఆ తల్లి ఒప్పుకుంటదా? కేసీఆర్ మలి దశ ఉద్యమానికి ఊపిరులూదకపోతే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ తల్లి మౌనంగా రోదిస్తుంది. అమర వీరుల ఆత్మలు క్షోభిస్తున్నవి. మిమ్మల్ని ఈ జాతి క్షమించదు" అని ప్రవీణ్ కుమార్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.