ఇలా ఏ ముఖ్యమంత్రీ చెప్పలేదు!: రేవంత్ రెడ్డి షరతుపై నటుడు సిద్ధార్థ
- భారతీయుడు-2 ఈవెంట్లో సీఎం షరతుపై ప్రశ్నించిన మీడియా
- తాను 2005 నుంచే సామాజిక బాధ్యతతో పని చేస్తున్నానన్న హీరో
- ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఏదైనా చెబితే చేస్తామని స్పష్టీకరణ
- మీరు ఇలా చేస్తే... అది చేస్తామని ఏ సీఎం చెప్పలేదని వ్యాఖ్య
ఇది తన బాధ్యతగానే భావించానన్నారు. అయితే ప్రతి నటుడికి బాధ్యత ఉందా? అనే ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేనన్నారు. ప్రతి నటుడు బాధ్యతగా ఉండాలన్నారు. మా అంతట మేమే బాధ్యతగా తీసుకొని చేస్తామన్నారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఏదైనా చేయాలని చెబితే చేస్తామన్నారు. అయితే, మీరు ఇలా చేస్తేనే... అది చేస్తామని ఏ సీఎం కూడా షరతు పెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు.