రూ. ఐదొందలకే అమ్మేశారట.. యూజీసీ నెట్ పేపర్ లీక్ లో సంచలనం
- డార్క్ నెట్, టెలిగ్రామ్ యాప్ లో నెట్ పేపర్ షేర్ అయినట్లు గుర్తింపు
- పేపర్ లీక్ నిజమని నిర్ధారణ అయ్యాకే పరీక్ష రద్దు చేశామన్న కేంద్ర మంత్రి
- బీహార్ పోలీసులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నామని వెల్లడి
ఏటా రెండుసార్లు నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష ద్వారా సమర్థులను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ లుగా ఎంపిక చేస్తారు. దీనికోసం పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ ఏడాది నిర్వహించిన పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. పేపర్ లీక్ జరిగిందని పలుచోట్ల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి. తొలుత ఈ ఆరోపణలను కేంద్రం ఖండించింది.. అయితే, తర్వాత లీక్ నిజమేనని అంగీకరిస్తూ పరీక్ష రద్దు చేసింది.
‘నెట్’ పేపర్ ను దుండగులు డార్క్ నెట్ లో రూ.500 ల నుంచి రూ.5 వేల వరకు పలువురికి అమ్మినట్లు తెలుస్తోంది. డార్క్ నెట్ తో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫాం టెలిగ్రామ్ లోనూ నెట్ పేపర్ పలువురు షేర్ చేసుకున్నారని అధికారులు గుర్తించారు.