'దేవర'కి పోటీగా దిగుతున్న 'వేట్టైయాన్'
- ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'దేవర'
- ఆయన జోడీ కట్టిన జాన్వీ కపూర్
- దసరాకి రిలీజ్ అవుతున్న సినిమా
- అదే రోజున రానున్న రజనీ 'వేట్టైయన్'
అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ సోలోగా వస్తున్నాడు కనుక, వసూళ్ల పరంగా ఈ సినిమాకి చాలా హెల్ప్ అవుతుందని అంతా భావించారు. అయితే ఇప్పుడు అదే డేట్ కి రజనీకాంత్ రంగంలోకి దిగుతున్నారు.
రజనీకాంత్ హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో 'వేట్టైయాన్' సినిమా రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోంది. రజనీకాంత్ బాడీ లాంగ్వేజ్ కి తగిన కంటెంట్ ఇది. అమితాబ్ .. ఫహాద్ ఫాసిల్ .. రానా వంటి బలమైన తారాగణం ఉన్న సినిమా ఇది. ఇక ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడు అనిరుధ్ కావడం విశేషం. తమ సినిమా కూడా అక్టోబర్ 10వ తేదీన వస్తుందని రజనీ క్లారిటీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.