'భారతీయుడు 2' నుంచి లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్!
- కమల్ ప్రధాన పాత్రగా 'భారతీయుడు 2'
- ప్రత్యేక ఆకర్షణగా భారీతారాగణం
- సంగీతాన్ని సమకూర్చిన అనిరుధ్
- జులై 12వ తేదీన గ్రాండ్ రిలీజ్
1996లో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ విడుదలై బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రూపొందుతోంది. అభిమానులు, సినీప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తోన్న ఈ మూవీ ప్రమోషన్స్ వేగం పుంజుకున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన 'ఇండియన్ 2' ఇంట్రో వీడియోతో పాటు రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘శౌర..’ అనే పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ క్రమంలో బుధవారం మేకర్స్ ‘చెంగల్వ చేయందేనా..’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. అనిరుద్ రవిచందర్ సంగీత సారథ్యంలో రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను అబ్బి, శ్రుతికా సముద్రాల పాడారు. కమల్ హాసన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.