బొత్స సత్యనారాయణ మా నాన్నను తాగుబోతు అన్నారు.. జగన్ కు ఉరి వేయాలన్నారు: షర్మిల
- రాజకీయాల కోసం జగన్ ఎంతకైనా దిగజారుతారన్న షర్మిల
- వైఎస్ గురించి నీచంగా మాట్లాడిన వాళ్లంతా ఇప్పుడు జగన్ కేబినెట్లో ఉన్నారని విమర్శ
- జగన్ కోసం పాదయాత్ర చేసిన వాళ్లు ఆయనకు ఏమీ కారని మండిపాటు
వైఎస్ ను తిట్టిన వాళ్లకే జగన్ పెద్దపీట వేశారని షర్మిల విమర్శించారు. తమ తండ్రిని తిట్టిన వాళ్లంతా జగన్ కు తండ్రులు, అక్కలు, చెల్లెళ్లు అని ఎద్దేవా చేశారు. జగన్ కోసం పాదయాత్రలు చేసిన వాళ్లంతా ఆయనకు ఏమీ కారని అన్నారు. వైఎస్సార్ కోసం పని చేసి గొడ్డలిపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఆయనకు ఏమీ కారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీలో వైఎస్సార్ లేడని... వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని చెప్పారు.