ఐశ్వర్య రాజేశ్ మామూలు ఛాన్స్ కొట్టలేదుగా!
- తమిళంలో దూసుకుపోతున్న ఐశ్వర్య రాజేశ్
- మలయాళంలోను మంచి గుర్తింపు
- శివరాజ్ కుమార్ సినిమాతో కన్నడలోను ఎంట్రీ
- ఆ సినిమాలో హైలైట్ గా నిలవనున్న 'దుర్గ' పాత్ర
అయితే ఐశ్వర్య రాజేశ్ పరిచయమవుతున్నది శివరాజ్ కుమార్ సినిమాతో కావడమే ఇక్కడి విశేషం. శివరాజ్ కుమార్ కథానాయకుడిగా దర్శకుడు రోహిత్ పడకి ఒక సినిమా చేస్తున్నాడు .. ఆ సినిమా పేరే 'ఉత్తరకాండ'. టైటిల్ తోనే ఈ సినిమా ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. కంటెంట్ ఏమై ఉంటుందా అనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఈ సినిమాలో 'దుర్గ' అనే కీలకమైన పాత్రలో ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. పోస్టర్ తోనే ఈ సినిమా చాలా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ఐశ్వర్య రాజేశ్ కన్నడలోను బిజీ అవుతుందేమో చూడాలి.
