ఆకట్టుకుంటున్న కన్నడ బ్లాక్‌బస్టర్ ‘లవ్ మాక్‌టెయిల్ 2‘లోని ‘నీదేలే నీదేలే జన్మ’ సాంగ్
- లవ్ మాక్‌టెయిల్‌కు కొనసాగింపుగా వచ్చిన లవ్మాక్టెయిల్ 2
- అపూర్వ విజయాన్ని అందుకున్న సినిమాలు
- తెలుగులో విడుదల చేస్తున్న కంచికామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్
- నటిస్తూ దర్శకత్వం వహించిన డార్లింగ్ కృష్ణ
ఈ సందర్భంగా నిర్మాత ఆర్ కృష్ణ మాట్లాడుతూ.. కన్నడ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను వేసవి సెలవుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చెప్పారు. డార్లింగ్ కృష్ణ నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన రెండో పాటను నేడు విడుదల చేసినట్టు తెలిపారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు ఘన విజయం అందిస్తారని ఆకాంక్షించారు. కాగా, ఇందులో డార్లింగ్ కృష్ణ తరపున మిలిన నాగరాజ్ నటించారు.