రఘురామకృష్ణరాజుకు ఇక నరసాపురం ఛాన్స్ లేనట్టే.. క్లారిటీ ఇచ్చేసిన బీజేపీ!
- పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ
- శ్రీనివాసవర్మను లోక్ సభ బరిలోకి దించిన బీజేపీ
- అభ్యర్థుల విషయంలో మార్పు ఉండదన్న సిద్ధార్థ్ నాథ్
తాజా పరిణామంతో రఘురాజు ఉండి అసెంబ్లీ నియోజకవర్గంపై ఫోకస్ చేస్తున్నారు. అయితే, ఇప్పటికే ఉండి శాసనసభ అభ్యర్థిగా రామరాజును టీడీపీ ప్రకటించింది. రామరాజు కూడా పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా లేరు. ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని ఆయన చెపుతున్నారు. ఈ నేపథ్యంలో, రఘురాజు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరి ఈయన విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. రఘురాజు ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.