టాలీవుడ్ టాప్ త్రీ హీరోయిన్స్ పరిస్థితి ఇదే!
- 'ఆచార్య' తరువాత కనిపించని పూజ హెగ్డే
- 'పుష్ప' స్థాయి హిట్ చూడలేకపోయిన రష్మిక
- 'దసరా' తరువాత హీరోయిన్ గా కనిపించని కీర్తి సురేశ్
- టాప్ త్రీ పొజీషన్స్ పట్ల అభిమానుల ఆసక్తి
ఈ ముగ్గురికి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో .. తమిళంలోను అంతే క్రేజ్ ఉంది. ముగ్గురిలో ఎవరో ఒకరి సినిమా వస్తూ సందడి ఉండేది. కానీ ఈ సారి ముగ్గురు హీరోయిన్స్ వైపు నుంచి కూడా గ్యాప్ వచ్చేసింది. 'ఆచార్య' తరువాత పూజ హెగ్డే పూర్తిస్థాయి హీరోయిన్ గా కనిపించలేదు. ఈ ఏడాదిలో ఆమె నుంచి వచ్చే తెలుగు సినిమా కూడా లేదు. అంటే ఇక్కడ ఈ సుందరికి మూడేళ్ల గ్యాప్ రానుంది. రష్మిక విషయానికి వస్తే 'పుష్ప' తరువాత ఆమెకి ఆ స్థాయిలో పేరు తెచ్చిన సినిమాలేం లేవనే చెప్పాలి.
'సీతా రామం' హిట్ అయినప్పటికీ, అందులో రష్మిక హీరోయిన్ కాదు. ఇక 'వారసుడు' చేసినప్పటికీ, అందులో రష్మిక పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఆ సినిమా వలన ఆమెకి ఒరిగింది కూడా ఏమీ లేదు. ఈ సినిమాతో చూసుకున్నా ఆమె నుంచి తెలుగు సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. అందువలన 'పుష్ప 2' వరకూ ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేయవలసిందే. ఈ సినిమా తరువాత చెప్పుకోదగిన తెలుగు ప్రాజెక్టులు కూడా ఆమె ఖాతాలో ఏమీ కనిపించడం లేదు.ఇక కీర్తి సురేశ్ పరిస్థితి ఇంతకంటే గొప్పగా ఏమీ లేదు. 'దసరా' సక్సెస్ తరువాత హీరోయిన్ గా ఆమె నుంచి ఇంతవరకూ తెలుగు సినిమా లేదు. ఈ ఏడాది కూడా ఆమె నుంచి వచ్చే తెలుగు సినిమాలు కనిపించడం లేదు. టాప్ త్రీ హీరోయిన్స్ గా ఉన్న ఈ ముగ్గురు భామలతో ఒక్క రష్మిక సినిమా మాత్రమే ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ గ్యాప్ లో ఈ భామలు స్థానాలు నిలుస్తాయో లేదో చూడాలి.