నేడు కల్వకుంట్ల కవిత, రేపు నువ్వో నేనో…?: ప్రవీణ్ కుమార్
- కవిత అరెస్ట్ ఒక భూటకమన్న ప్రవీణ్ కుమార్
- నాజీల పాలన కన్నా మోదీ పాలన ఘోరంగా ఉందని విమర్శ
- అక్రమ అరెస్ట్ లతో బెదిరేది లేదని వ్యాఖ్య
ఇలాంటి అక్రమ అరెస్ట్ లతో బెదిరేది లేదని చెప్పారు. బెదిరింపులకు బెదిరితే తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు. కవిత అరెస్ట్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న లోపాయకారీ ఒప్పందంలో భాగమేనని చెప్పారు. నాటి నాజీల నియంతృత్వ పాలన కన్నా మోదీ పాలన ఘోరంగా ఉందని అన్నారు. మొన్న సాయిబాబా, సిసోడియా, నిన్న హేమంత్ సొరేన్, ఈరోజు కవిత, రేపు నువ్వో నేనో? అని ప్రవీణ్ కుమార్ అన్నారు. అందుకే తెలంగాణ సమాజం, యావత్ దేశం బీజేపీ-కాంగ్రెస్ పార్టీలను తక్షణమే తిరస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.