చరణ్ ని అవమానించలేదు.. తన మూవీలో డైలాగ్ చెప్పాడంటున్న షారుఖ్ అభిమానులు
- వీడియోతో సోషల్ మీడియాలో వివరణ
- అంబానీ ప్రి వెడ్డింగ్ ఫంక్షన్ లో ఖాన్ త్రయంతో చెర్రీ స్టెప్పులు
- ఆ సమయంలో రామ్ చరణ్ ను షారుఖ్ అవమానించాడంటూ వివాదం
షారుఖ్ ఖాన్ నటించిన ‘వన్ 2 కా 4’ మూవీలో సౌత్ లో ఫేమస్ అయిన వాటి గురించి మాట్లాడుతూ.. ఇడ్లీ, వడ, రజనీకాంత్, వెంకటేశ్, నాగార్జున అంటూ చెబుతాడు. అంబానీ ఈవెంట్ లో చరణ్ ను పిలిచేటప్పుడు షారుఖ్ ఈ డైలాగ్ ను చెప్పాడు. రజనికాంత్ పేరుకు బదులు రామ్ చరణ్ పేరుతో డైలాగ్ మార్చేశాడు. అయితే, సౌత్ ఆడియన్స్ కు ఆ డైలాగ్ గురించి తెలియకపోవడంతో.. చరణ్ ను అవమానించారని భావించారు.