ఆహా తెరపైకి వచ్చేస్తున్న బోల్డ్ కంటెంట్ .. 'మిక్సప్'
- రొమాన్స్ ప్రధానంగా నడిచే 'మిక్సప్'
- రెండు జంటల చుట్టూ తిరిగే కథ
- టీజర్ తో అందరిలో పెరిగిన ఆసక్తి
- ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్
ప్రధానమైన రెండు జంటల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఒక జంటలో ఒకరికి .. మరొక జంటలో ఒకరికి శృంగారం అంటే అంతగా ఇష్టం ఉండదు. వాళ్లు తమ పార్ట్నర్ నుంచి ప్రేమను కోరుకుంటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య బంధాన్ని కలిపి ఉంచేదే శృంగారం అనే అభిప్రాయంతో మరో ఇద్దరు ఉంటారు. అక్షర గౌడ .. ఆదర్శ్ బాలకృష్ణ .. కమల్ కామరాజు .. పూజా జవేరి ప్రధానమైన పాత్రలను పోషించారు.
ఆకాశ్ బిక్కీ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఆ మధ్య హిందీలో వచ్చిన లస్ట్ స్టోరీస్ గురించి చాలాకాలం పాటు చెప్పుకున్నారు. అదే తరహాలో కనిపిస్తున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.
