ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా: నాగబాబు
- 5.3 అడుగుల ఎత్తున్న వారికి ఆర్మీ, పోలీస్ పాత్రలు సెట్ కావన్న నాగబాబు
- ఒక హీరో గురించి ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం
- ఆ మాటలు యాదృచ్ఛికంగా వచ్చినవేనని వివరణ
ఈ నేపథ్యంలో నాగబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ... పోలీస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది... 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడానని చెప్పారు. ఆ మాటలను తాను వెనక్కి తీసుకుంటున్నానని... ఎవరైనా ఆ మాటలకు నొచ్చుకునుంటే... అయాం వెరీ సారీ అని అన్నారు. ఆ మాటలు యాదృచ్ఛికంగా వచ్చినవే కానీ, కావాలని అన్న మాటలు కాదని చెప్పారు. అందరూ అర్థం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.