అఘోరగా విష్వక్సేన్ .. 'గామి' రిలీజ్ డేట్ ఖరారు!
- విష్వక్సేన్ కథానాయకుడిగా 'గామి'
- అఘోర పాత్రలో కనిపించనున్న హీరో
- కీలకమైన పాత్రలో చాందినీ చౌదరి
- మార్చి 8వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమాలో విష్వక్సేన్ అఘోరగా కనిపించనున్నాడు. ఆయన పాత్ర పూర్తి భిన్నంగా తెరపై కనిపించనుంది. తన బాడీ లాంగ్వేజ్ కి దూరంగా.. తన ఇమేజ్ కి భిన్నమైన పాత్రను ఆయన పోషించడం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాతో విద్యాధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
కీలకమైన పాత్రలో చాందినీ చౌదరి కనిపించనుంది. ఈ సినిమా చిత్రీకరణ కాశీలోను .. హిమాలయాలలోను చేసినట్టుగా విష్వక్ చెప్పాడు. దర్శకుడికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని అన్నాడు. తాజాగా ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మార్చి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.