రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మీనా?
- మీనా బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు
- ఢిల్లీలో కేంద్ర మంత్రి మురుగన్ ఇంట్లో వేడుకకు మీనా
- వేడుకలో మీనాకు అధిక ప్రాధాన్యం
ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు. ఈ వేడుకలో మీనాకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారట. తమిళనాడు నుంచి వెళ్లిన వారిలో మీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె బీజేపీలో చేరబోతున్నారని... అందుకే ఆమెకు అంతటి ప్రాధాన్యతను ఇచ్చారని చెపుతున్నారు. మీనా కూడా బీజేపీలో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేశారని సమాచారం.
