ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం... పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా
- ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు
- రాజీనామా లేఖను ఖర్గేకు అందించిన గిడుగు
- ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ కు కొత్త నాయకత్వం
గిడుగు రుద్రరాజు ఇవాళ తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. ఈ క్రమంలో, ఎల్లుండి లోపు ఏపీ కాంగ్రెస్ కొత్త చీఫ్ పేరును ఏఐసీసీ ప్రకటించే అవకాశాలున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్ పదవిపై షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి హామీ లభించినట్టు తెలుస్తోంది.