నాగార్జున 'నా సామిరంగ' నుంచి విజిల్ థీమ్ సాంగ్ విడుదల
- నాగార్జున హీరోగా నా సామిరంగ చిత్రం
- దర్శకుడిగా పరిచయం అవుతున్న కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ
- సంక్రాంతి కానుకగా రిలీజవుతున్న 'నా సామిరంగ'
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న నా సామిరంగ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో నాగార్జున, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ తదితరులు నటించారు.