విజయకాంత్ సమాధి వద్ద కన్నీరు పెట్టుకున్న సూర్య
- విదేశాల నుంచి తిరిగొచ్చిన సూర్య
- విజయకాంత్ సమాధి వద్ద నివాళి
- ఆయన మరణం షాక్ కు గురి చేసిందని ఆవేదన
విజయకాంత్ మరణం తనను షాక్ కు గురి చేసిందని చెప్పారు. కెరీర్ ఆరంభంలో నాలుగు సినిమాల్లో నటించినప్పటికీ తనకు గుర్తింపు రాలేదని... ఆ సమయంలో 'పెరియన్నా' సినిమాలో విజయకాంత్ తో కలిసి పని చేశానని తెలిపారు. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేయాలని ఆయన తనను ప్రోత్సహించేవారని చెప్పారు. అందరితో ఎంతో మంచిగా మాట్లాడేవారని అన్నారు. ఆయన మరణం చిత్ర సీమకు తీరని లోటు అని చెప్పారు.