జీ 5లో స్ట్రీమింగ్ దిశగా కంగనా 'తేజస్'
- కంగనా ప్రధానమైన పాత్రగా 'తేజస్'
- వైమానిక దళ పైలట్ గా కంగనా
- అక్టోబర్ 27న విడుదలైన సినిమా
- ఈ నెల 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్
అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ 5వారు దక్కించుకున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ఒక పోస్టర్ ను వదిలారు. 2016లో భారత వైమానిక దళంలో మొదటిసారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.
భారతీయ వైమానిక దళానికి చెందిన మహిళా పైలట్ గా కంగనా రనౌత్ కనిపిస్తుంది. పాకిస్థాన్ కి సంబంధించిన ఒక సీక్రెట్ ఆపరేషన్ లో పాల్గొనే పైలట్ గా ఆమె పాత్ర కొనసాగుతుంది. కంగనా లుక్ .. ఆమె నటన ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయి. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి.